AP: విశాఖలో మొంథా తుఫాన్ ప్రభావం మొదలైంది. విశాఖ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్టల్ బ్యాటరీ ప్రాంతంలో 8 నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర తుఫానుగా మారుతున్న క్రమంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.