కోనసీమ: జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాలు, ఇతర వివరాలను 8 నెలల క్రితం జియోట్యాగింగ్ చేయించినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదల సమయంలో ఆ వివరాల ఆధారంగా సహాయక చర్యలు అందించామన్నారు. ఇందులో ప్రతి ప్రాంతానికి సంబంధించిన సమగ్ర వివరాలు పొందుపర్చారు. దీని ఆధారంగా ఎక్కడ నివాసాలకు ముప్పు వాటిల్లుతుందో తక్షణం అంచనా వేస్తున్నట్లు తెలిపారు.