NLG: జాగృతి పోలీస్ కళాబృందం వారు చిట్యాల పోలీసు వారి ఆధ్వర్యంలో మండలంలోని గుండ్రాంపల్లిలో సోమవారం రాత్రి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరాల గురించి కళాకారులు ఆటపాట ద్వారా గ్రామస్తులకు వివరించారు.