PPM: సాలూరు మండలంలో పలు గ్రామాలలో అధికారులు బృందం పర్యటించారు. ఎంపీడీవో గొల్లపల్లి పార్వతి ఆధ్వర్యంలో అధికారులు ముంపు ప్రభావిత గ్రామాలు తుండా, లక్ష్మీపురం, మావుడి తదితర గ్రామాలలో పర్యటించి వర్షాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. మామిడిపల్లి గ్రామంలో అటవీశాఖ అధికారులతో కలిసి వరద వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ చేసి చూపించారు.