ప్రకాశం: తుఫాన్ నేపథ్యంలో సీఎస్ పురం ఎస్టీ పాఠశాలలో అధికారులు తుఫాన్ పునరావాస కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. పునరావస కేంద్రాన్ని అధికారులతో కలిసి మండల బీజేపీ అధ్యక్షుడు ఇండ్ల సత్యం పరిశీలించారు. మండలంలో తుఫాను తీవ్రతను, తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. పునరావాస కేంద్రంలో బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.