HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్వీప్ చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్కులో అతిపెద్ద బెలూన్ను ఎగురవేశారు. దీనిపై పోలింగ్ తేదీతో పాటుగా ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్’ అంటూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో సందేశాలను ప్రదర్శించారు. ఓటు హక్కు వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.