VZM: జిల్లాలో తుఫాన్ పరిస్థితుల దృష్ట్యా భోగాపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన ముక్కాం గ్రామాన్ని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఎస్పీ ఎ. ఆర్. దామోదర్ సోమవారం సాయంత్రం సంయుక్తంగా పర్యటించారు. ఈ సందర్బంగా మత్స్యకారులతో మాట్లాడి ప్రస్తుత తుఫాన్ నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు. వాతావరణ హెచ్చరికలను గమనించి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.