HYD: ప్యారడైజ్ చౌరస్తా నుంచి డెయిరీ ఫారం చౌరస్తా వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టేందుకు ఈనెల 30 నుంచి 9 నెలల పాటు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బాలంరాయి రాజీవ్ గాంధీ విగ్రహం కూడలి నుంచి కంటోన్మెంట్ సీఈవో రెసిడెన్స్ మీదుగా బాలంరాయి బాబూజగ్జీవన్ రాం విగ్రహం చౌరస్తా వరకు రహదారిని ఇరువైపులా మూసేయనున్నారు.