టెస్టులు, వన్డేలలో ఒక మాదిరి ప్రదర్శన చేస్తున్న టీమిండియా పొట్టి ఫార్మాట్లో మాత్రం అదరగొడుతోంది. ఆడిన చివరి 10 టీ20ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడింది. ఇందులో 8 మ్యాచ్లలో విజయం సాధించగా.. ఒక మ్యాచ్ టై అయింది. అటు ఆస్ట్రేలియా కూడా చివరి 10 టీ20ల్లో ఒక్క మ్యాచ్లోనే ఓడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది.