KRNL: చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి. కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP తెలిపారు.