PDPL: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద హెచ్చరిక.. శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి నీటిని వదిలినందున వర్షాల ప్రభావంతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద ప్రవాహం పెరగనుంది. అవసరమైతే గేట్లు ఎత్తి నీరు వదిలే అవకాశం ఉందని రామగుండం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీ.రవీంద్ర చారి తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టడం, పశువులను మేపడానికి వెళ్లొద్దని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు