తూ.గో: మొంథా తుఫాన్ కారణంగా గోదావరి లంకల్లో నుంచి తీసుకువచ్చిన మత్స్యకారులను చందా సత్రంలో పునరావాసం కల్పించారు. ఈ సందర్భంగా బుధవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేంద్రాన్ని పర్యవేక్షించారు. ప్రభుత్వపరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారా లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, వైద్యం అందించాలని కోరారు.