MNCL: వేమనపల్లి మండలంలో గుడుంబా నిర్మూలన దిశగా గ్రామాల్లో చైతన్యం మొదలైంది. వేమనపల్లి గ్రామ ప్రజలంతా ఏకమై బుధవారం నుంచి గ్రామంలో గుడుంబా పూర్తిగా నిషేధిస్తున్నామని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ప్రతిజ్ఞ చేశారు. ఇకపై గుడుంబా తయారు, అమ్మడం, తాగడం, రవాణ వంటి వాటిని పూర్తిగా నిషేధిస్తున్నామని, ఎవరైనా గుడుంబా రవాణా చేస్తే పోలీస్ సిబ్బందికి అప్పగిస్తామన్నారు.