మొంథా తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షాలకు దక్షిణ మధ్య రైల్వే ఫలక్నుమా, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ సహా 127 రైళ్లను రద్దు చేసింది. మరో 14 రైళ్లనూ దారి మళ్లించింది. వర్షాలతో పలు చోట్ల పట్టాలపైకి వరద చేరడంతో మహబూబాబాద్ జిల్లాలో కోణార్క్, గోల్కొండ ఎక్స్ప్రెస్ .. కృష్ణా జిల్లాలో సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది.