VZM: కొత్తవసల కూడలిలో వివిధ పార్టీ నాయకుల పలుచోట్ల ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ఈదురు గాలులకు రోడ్డు మీద నేలకొరిగాయి. ఆ సమయంలో రోడ్డు మీద జనసంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనివలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో హైవే పోలీసులు, స్థానిక ఎఎస్సై జనార్ధనరావు గమనించి వాటిని దగ్గర ఉండి తొలగించారు.