VSP: అగనంపూడిలో ఉన్న శ్రీ శిరిడి సాయి ధ్యాన మందిరంలో గురువారం ఏకాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు 12 గంటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి బాబా భక్తులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.