SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నిర్వహణ నిధులను విడుదల చేయాలని కోరుతూ మంగళవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై ఐదు నెలలు గడిచిన ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదని అన్నారు.