NLG: కాంట వేయని ధాన్యం ఒకవైపు…కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ‘మొంథా’ తుఫాన్‌తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజకవర్గంలోని 6 హాకా, 6 మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా 10 సెంటర్లల్లో ధాన్యం తడిసి ముద్ద కాగా, మరో 18 పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.