VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్టర్ రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముంథా తుఫాను కారణంగా సెలవు ప్రకటిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు, బోధన సిబ్బంది గమనించాలని సూచించారు. తుఫాను కారణంగా సోమ, మంగళవారాలు కూడా సెలవుదినంగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.