ELR: జిల్లాలో 54 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి, బాధితులైన 1,937 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతీ కేంద్రంలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాలో 148 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, 318 మంది గర్భిణులను పీహెచ్సీల్లోకి తరలించామని మంత్రి తెలిపారు