తూ.గో: రాజమండ్రిలోని కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ప్రత్యేక అధికారి కె.కన్నబాబు, కలెక్టర్ కీర్తి చేకూరి, జేసీ వై.మేఘ స్వరూప్ పరిశీలించారు. సిబ్బందికి కన్నబాబు పలు సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, అవసరమైతే వెంటనే క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.