ATP: జిల్లా పరిషత్ ప్రధాన సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. మాజీ జడ్పీ ఛైర్మన్ రెడ్డప్ప మృతికి నివాళులర్పించిన అనంతరం, అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సభ్యులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చైర్పర్సన్ గిరిజమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.