సత్యసాయి: ఎమ్మెల్సీ కావలి గ్రీష్మను జిల్లా మాల మహానాడు నాయకులు, హెచ్ఆర్సీసీఐ సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. బసంపల్లిలో స్మశాన వాటిక సమస్య, దళితుల భూ సమస్యలు (పరిగి, సోమందేపల్లి)తో పాటు, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో కౌంటర్ కేసులు పెట్టడం వంటి సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ గ్రీష్మ హామీ ఇచ్చారు.