SRPT: మొంథా తుఫాన్ తెలంగాణ మీదుగా వాయుగుండంగా బలహీనపడినట్లు IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ నుంచి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని సూచించింది. రైతులు, వాహనాదారులు అత్యవసర పరిస్థితిలో తప్పితే బయటికి రావోద్దని హెచ్చరికలు జారీ చేసింది.