WGL: ఖానాపురం మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపై HIT NEWS కథనానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ సంఘటనపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మోతి మంగళవారం రాత్రి నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. వైద్యులను అడిగి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.