అన్నమయ్య: జిల్లాలో ఇవాళ పాఠశాలలకు ఎలాంటి సెలవు లేదని జిల్లా విద్యాశాఖాధికారి డా. కె. సుబ్రమణ్యం స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలలు యథావిధిగా కొనసాగించాలని అన్ని మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు కూడా తరగతులు నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్లు కూడా తెరవాలని డీఈవో స్పష్టం చేశారు.