ఏపీ తీరం వైపు మొంథా తుఫాను కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. మరికొద్దిగంటల్లోనే తీవ్ర తుఫానుగా బలపడనుంది. తీవ్ర తుఫానుగా మారి ఏపీ తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటనుంది. తీరందాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ క్రమంలో రేపు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.