మీ చిన్నారులకు మీ డబ్బు కంటే తల్లిదండ్రుల సహచర్యమే ఎక్కువ అవసరం. వారికి ఆస్తులు, అంతస్తులు అవసరం ఉండదు. ఆటపాటలు, బుడిబుడి నడకలు, నవ్వులతో కూడిన వారి ఎదుగుదలను చూడటానికి ఎక్కువ కాలం జీవించగలిగే తల్లిదండ్రులే వారికి అవసరం. మీ సంతానానికి ఇవ్వగల ఉత్తమ వారసత్వం మీరు ఆరోగ్యంగా ఉండటమే. ఆ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలుపెట్టండి.