VZM: వంగర మండలం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన రైతు పారిశర్ల వెంకటరమణ (49) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. సోమవారం సాయంత్రం పొలానికి వెళ్లాడు. దారిలో వర్షానికి తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్కు గురై మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు.