కోనసీమ: తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం నియోజకవర్గంలోని నాలుగు మండలాల రెవెన్యూ, పిఆర్, పోలీస్, ఎలక్ట్రికల్, తదితర ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. తుఫాన్ తీరం దాటే సమయంలో, దాటిన తర్వాత అత్యంత వేగంగా గాలులు వీస్తాయని తెలిపారు. ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.