ASF: బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై దృష్టి కేంద్రీకరించాలని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన రెబ్బెన మండలం గోలేటిలోని జీఎం కార్యాలయంలో ఏరియా ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్ష నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టాయని, ఈ వార్షిక సంవత్సరంలో సాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు.