అన్నమయ్య: మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు న్యాయవాది ఆవుల శివరామిరెడ్డి ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన మృతి చెందారు. ఆయన రెడ్డి సంక్షేమ సంఘం న్యాయ సలహాదారులుగా ఉన్నారు. న్యాయవాదులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.