SKLM: శ్రీకాకుళం మండలం కొత్తరోడ్డు జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి 16 పక్కనే చెత్తా చెదారం కుప్పలుగా ఉందని స్థానికులు అంటున్నారు. అటు రోడ్డు పక్కనే చెత్తా చెదారం ఉండటంతో దుర్వాసన అధికంగా వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. దీంతో రాత్రిపూట దోమల బెడద ఎక్కువగా ఉంటుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.