BDK: భాగం కేశవులు మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సుజాతనగర్ మండలం అంజనాపురంలో అనారోగ్య కారణాలతో మరణించిన సీపీఐ సీనియర్ నేత భాగం కేశవులు అంతిమయాత్రలో MLA కూనంనేని, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పాల్గొని పడే మోశారు. కేశవులు పార్థివ దేహంపై పార్టీ కండువ కప్పి నివాళి అర్పించారు.