అన్నమయ్య: పిచ్చాటూరు మండలం వెంగళత్తూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల జల దిగ్భంధానికి గురైంది. పాఠశాల చుట్టుపక్కల భారీగా నీరు చేరింది. పాఠశాల ఆవరణంలో పాములు, జెర్రీలు, తేళ్ళు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ విషయంలో అధికారులు తగు సహాయ సహకారాలు అందించాలని వెంగళత్తూర్ ఎస్టీ కాలనీ వాసులు కోరుకుంటున్నారు.