KRNL: 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో నిర్వహిస్తున్న అతిరుద్ర హోమంలో కుటుంబసమేతంగా MLA బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి పూజా కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులకు నాయకులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.