కోనసీమ: ఆత్రేయపురం మండలం నరసన్నపేట నుంచి 100 కుటుంబాలకు చెందిన అగ్నికుల క్షత్రియులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఉద్దరాజు గాంధీరాజు, చేకూరి అప్పలరాజు, రజికపేట నుంచి అంగరి రామారావు, వేల్పూరి వెంకటేష్, వేల్పూరి ఆదినారాయణ చేరారు. వారికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.