CTR: చిత్తూరు అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, ఆర్ముడ్ రిజర్వ్ ఏఎస్సై గౌస్ బాషా, ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ బొబ్బిలి రాజు ఈ నెలలో పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ గెస్ట్ హౌస్లో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో వారిని శుక్రవారం సన్మానించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆయన సూచించారు. అనంతరం ఏ సమస్య వచ్చినా పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.