KRNL: ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి హౌసింగ్, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.