VSP: తుఫాను వర్షాల కారణంగా విశాఖలోని 36వ వార్డు, ఏవీఎన్ కాలేజీ డౌన్లోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ (ఏఎంసీ) ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే పార్కింగ్ చేసిన ఆటో పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్ బుధవారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ హరీష్‌కు ఆయన ఆర్థిక సహాయం అందించారు.