కోనసీమ: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రామచంద్రపురం మండల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని, తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తహసీల్దార్ మృత్యుంజయరావు తెలిపారు. వీఆర్వో, వీఆర్ఏలు, రేషన్ డీలర్లు, వైద్య సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులతో ముందస్తు చర్యలపై ఆయన సమీక్షించారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 9849386738లో సంప్రదించాలన్నారు.