AP: మొంథా తుఫాన్ ప్రభావంతో ఇవాళ పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరాల్సిన అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. విశాఖ-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్, బెంగళూరు-విజయవాడ, విజయవాడ-బెంగళూరు, హైదారాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖ సర్వీసులు రద్దయ్యాయి.