ఢిల్లీలో 2020-21లో రైతుల నిరసనలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదస్పదమయ్యాయి. ఈ వ్యవహారంలో ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఆనాటి పోస్టుకు క్షమాపణలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆ సమయంలో మహీందర్ కౌర్ అనే 73 ఏళ్ల మహిళపై కంగన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.