KNR: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) నూతన కార్యాలయ భవనాన్ని సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఇంతకుముందు టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపై పని చేసిన సీసీఎసు, ఇప్పుడు రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్లో నిర్మించిన కొత్త భవనంలోకి తరలించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.