NLR: భారీ వర్షాల నేపథ్యంలో నిండుకుండలా మారిన సోమశిల జలాశయం నుంచి అధికారులు 60వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని వీర్లగుడిపాడు గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. ఆర్డీవో పావని, డీఎస్పీ వేణుగోపాల్ గ్రామాన్ని సందర్శించి నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేశారు.