ATP: అనంతపురంలోని డీఈఓ కార్యాలయం వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడుతూ.. సెలవు దినాలలో తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఈవోకు అందజేశారు.