ATP: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా అనంతపురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. HLC కెనాల్ పక్కన వెలసిన మంజునాథ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో మార్మోగాయి.