KKD: ‘మొంథా’ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తతం కాకినాడకు 530KM, విశాఖకు 560KM దూరంలో తుఫాన్ ఉంది. గంటకు దాదాపు 17KM వేగంతో తీరం వైపు వస్తోంది. ఉమ్మడి తూ.గో జిల్లాలో అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముంపునకు గురయ్యే ప్రజలు వాటిలోకి వెళ్లాలని కోరుతున్నారు. నేటి సాయంత్రం నుంచి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.