ప్రకాశం: పామూరు పట్టణంలోని లోతట్టు ప్రాంతమైన ఎస్టీ కాలనీలో సోమవారం సీఐ భీమా నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని పోలీస్ యంత్రాంగమంతా ఎటువంటి పరిస్థితులైన ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి భరోసా కల్పించారు. అనంతరం లోతట్టు ప్రాంత ప్రజలందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.