KDP: ప్రొద్దుటూరులోని విత్తన తయారీ కేంద్రాలను సోమవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ప్రొద్దుటూరు ADA అనిత, MAO వరహరికుమార్లు స్థానిక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ప్రభుత్వ సబ్సిడీ బుడ్డ శనగ విత్తనాల నాణ్యతను తనిఖీ చేశారు. నిబంధనల మేరకు విత్తనాల సరఫరా చేయాలని నిర్వాహకులను ఆదేశించి, చౌడూరులో రాయితీ బుడ్డ శనగ విత్తనాల పంపిణీని అధికారులు పరిశీలించారు.